Posts

Showing posts with the label Telugu Articles

గుణవతియైన స్త్రీ యొక్క ముఖ్య లక్షణాలు

Image
సామెతలు 31:10-31 లో గుణవతియైన స్త్రీను కనుగొనడం కష్టం అని చెప్పబడింది. ఆమె అరుదైన ధనము, మాణిక్యములకంటే విలువైనది . దేవునికి గుణవతియైన స్త్రీ అనగా — దేవుని నిజముగా ఆరాధించే స్త్రీ. అది ఆమె మాటల్లో, ఆమె కార్యాల్లో, అలాగే ఆమె ధరించే విధానంలో కూడా కనిపిస్తుంది. అటువంటి స్త్రీ బలమైనది, విశ్వాసముగలది, విధేయురాలు, మర్యాదగల స్త్రీ, మరియు సత్యమునకు కట్టుబడి ఉంటుంది. సామెతలు 31వ అధ్యాయం చదువుతున్నప్పుడు గుణవతియైన స్త్రీ యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు మనకు కనిపిస్తాయి: ఆమె అమూల్యురాలు మరియు విలువైనది (31:10) ఆమె మాణిక్యములకంటే, వజ్రములకంటే గొప్పది, విలువైన రత్నాలవలె ఆమె సౌందర్యముగలది; అవి ఎలా రూపుదిద్దుకొని బలపడతాయో , అలాగే ఆమె కూడా నిత్యకాలము వరకు బలపడుతూ రూపుదిద్దుకుంటుంది . ఆమె విశ్వాసయోగ్యురాలు మరియు సంపూర్ణురాలు (31:11-12) ఆమె తన కుటుంబ సభ్యుల హృదయాలను శాంతితో నింపుతుంది. అందరూ ఆమెను మరియు ఆమె సామర్థ్యాలను విశ్వసిస్తారు, ఎందుకంటే ఆమె విశ్వాసాన్ని సంపాదించింది. ఆమె స్వభావం, విశ్వాసం, మాటలు, మంచి కార్యాల కోసం ప్రశంసింపబడుతుంది. ఆమె వినయశీలురాలు; తన్ను తాను పొగడుకోకుండా ఇతరుల అభివృద్ధికి కృషి చే...

మన కన్నీళ్లకు సమాధానం ఇచ్చే దేవుడు

Image
 "...............నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా ?" (కీర్తనలు 56:8) మన జీవితంలో సమస్యలు ఎక్కువగా మనకే ఉన్నాయని , ఇతరులెవరూ ఇంత బాధపడటం లేదని మనం అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా, అందరూ ఆనందంగా జీవిస్తున్నారు, ఎందుకు నేను మాత్రమే ఇంతగా బాధపడాలి? అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఆందోళన చెందుతుంటాం. కానీ దేవుని వాక్యాన్ని — బైబిలులో చెప్పబడినట్లు మన పాదాలకు దీపమై, మార్గానికి వెలుగై ఉన్న వాక్యాన్ని — పరిశీలించినప్పుడు, అనేక మంది తమ కష్టాల్లో దేవుని యెదుట ఏడ్చినప్పుడు, వారి కన్నీళ్లకు దేవుడు ఎలా సమాధానం ఇచ్చాడో మనకు చూపిస్తుంది. ఇప్పుడు వాటిని చూద్దాం. హాగరు కన్నీళ్లు "పిల్లవాడి మరణమును నేను చూడకుండునట్లు ఉండనీయుమని చెప్పి, అతనికి ఎదురుగా దూరముగా కూర్చొని గట్టిగా విలపించెను." (ఆదికాండము 21:16). ఇక్కడ హాగరు తన కుమారుని కోసం అసహాయంగా ఏడుస్తున్నది. ఇదే విధంగా మనము చాలాసార్లు మన పిల్లల ప్రవర్తన, అలవాట్లు, ఈ లోక జీవనశైలిని గూర్చి ఆందోళన చెంది కన్నీళ్లు కారుస్తుంటాం. “మా మొరను వినవా?” లేదా “మా ప్రార్థనలు వినడంలేదా?” అని దేవునిని ప్రశ్నిస్తుంటాం....

భాగం 3: ఉపవాసం యొక్క లాభాలు & దాన్ని ఎలా ఆచరించాలి

Image
బైబిల్లో ఉపవాసం ఎప్పుడూ ఒకే ఫలితాన్ని ఇచ్చింది:  నిజమైన ఉపవాసం చేసాక  —  మనుషులు దేవుని స్వరాన్ని వినారు, దేవుడు అద్భుతాలు చేయడాన్ని చూశారు, నిజమైన మార్పు ను   అనుభవించారు.  మనము  ప్రతిసారి ఉపవాసం చేసినప్పుడు ఏదో ఒకటి తప్పకుండా మారుతుంది — కొన్నిసార్లు అది మనకు కనబడుతుంది, కొన్నిసార్లు కనిపించకపోవచ్చు.  ఇప్పుడు ఈ ఉపవాస క్రమంలో అత్యంత అందమైన భాగం ఇదే — ఉపవాసంలో లభించే ప్రతిఫలాలు.  దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనం నిజంగా ఆచరించినప్పుడు మనకు లభించే లాభాలు/ఫలితాలు ఏమిటో, అలాగే ఉపవాసం మన వ్యక్తిగతంగా & ఆత్మీయంగా ఎలా సహాయపడుతుందో చూద్దాం: ఉపవాసం వల్ల కలిగే లాభాలు: ఉపవాసం నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది . (అపొస్తలుల కార్యములు 13:2–3) ఉపవాసం మనలను అన్ని ఆపదలు లేదా ప్రమాదాల నుండి కాపాడుతుంది . (ఎస్తేరు 4:16) ఉపవాసం ఆత్మీయ దృష్టిని   తెరుస్తుంది. (దానియేలు 10:2–3) ఉపవాసం సాతానును ఓడించడానికి సహాయపడుతుంది. (మత్తయి 4:2) ఉపవాసం శోధనలను జయించడానికి సహాయపడుతుంది. (మత్తయి 4:2) ఉపవాసం మనలను ఆత్మీయంగా బలపరుస్తుంది . (మత్తయి 4:2) ఉపవాసం దేవునితో మన సం...

భాగం 2: బైబిలులో ఉపవాసం చేసే వివిధ విధానాలు

Image
ఉపవాసం అంటే కేవలం కొంతసేపు భోజనం మానేసి టీవీ చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపటం లేదా ఇతర లౌకిక కార్యకలాపాల్లో పాల్గొనటం కాదు.  అసలు ఉపవాసం అంటే — మనలను పూర్తిగా ప్రభువుకు అప్పగించుకోవడం, మన పాపాల పట్ల పశ్చాత్తాపపడటం, ప్రార్థన, ఆరాధన మరియు పవిత్ర గ్రంథాన్ని ధ్యానించడంలో ప్రభువుతో సమయం గడపడం. ఇప్పుడు ఉపవాసం అంటే ఏమిటో, అది ఎందుకు ముఖ్యమో మనకు అర్థమైంది కాబట్టి, బైబిలులో చెప్పబడిన వివిధ ఉపవాస విధానాలను మరియు వాటి ద్వారా వచ్చిన శక్తివంతమైన ఫలితాలను చూద్దాం. బైబిలులో ఉపవాసం చేసే వివిధ విధానాలు 1. చిన్న ఉపవాసం (ఒక రోజు లేదా కొన్ని గంటలు / 1-రోజు ఉపవాసం): న్యాయాధిపతుల గ్రంథంలో, ఇశ్రాయేలీయులు దేవుని నుండి త్వరితమైన నడుపుదల కోసం  సాయంత్రం వరకు ఒక రోజు ఉపవాసం చేశారు (న్యాయాధిపతులు 20:26). ఫలితం — దేవుడు వారికి శత్రువులపై విజయం ఇచ్చాడు. 2. సంపూర్ణ ఉపవాసం (ఆహారం లేదు, నీరు లేదు / 3-రోజుల ఉపవాసం): ఎస్తేరు మరియు  షూషను  పట్టణంలోని యూదులు తమ ప్రజలను రక్షించమని దేవుని యొక్క సహాయం కోరుతూ మూడు రోజులు మూడు రాత్రులు నిరంతరంగా ఉపవాసం చేశారు. ఫలితం — దేవుడు యూదులను రక్షించాడ...

భాగం 1: ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత

Image
మనలో చాలామంది ఉపవాసం చేసి, ప్రార్థించినా – ఏమి మారటంలేదు అనుకుంటున్నారా?  దేవునికి  మొరపెడుతున్నాం, అన్ని సరిగా చేస్తున్నట్టే అనిపిస్తోంది, అయినా ఫలితం లేదు. పరిష్కారం లేదు. మార్పు లేదు. సమాధానాలు లేవు – కేవలం ప్రశ్నలే. అంటే మనం చేస్తున్న విధానం దేవుడు కోరుకునే విధంగా లేకపోవచ్చు. బైబిల్‌లో ఎంతో మంది వివిధ రకాలుగా ఉపవాసం చేసి, దేవుని నుండి గొప్పగా, ఆశ్చర్యకరమైన, అన్వేషించలేని సమాధానాలు పొందారు. ఎస్తేరు – తన ప్రజలను రక్షించుకోవటానికి ముందు 3 రోజులు ఆహారం, నీళ్లు లేకుండా ఉపవాసం చేసింది (ఎస్తేరు 4:16). ఫలితం: దేవుడు మొత్తం యూదుల జాతిని రక్షించాడు. దానియేలు – దేవుని నుండి అవగాహన కోసం 21 రోజులు ఉపవాసం చేశాడు (దానియేలు 9:3; 10:2–3). ఇది పూర్తిగా అన్నపానీయాలు మానివేసే ఉపవాసం కాకుండా, భోగభాగ్యాలను (రుచికరమైన ఆహారం, మాంసం, ద్రాక్షారసం, సుగంధ తైలాలు) త్యజించిన ఉపవాసం. ఫలితం: దర్శనాలు, దేవదూతల సందేశాలు పొందాడు. పౌలు (అపొస్తలుడు) – పశ్చాత్తాపం మరియు ఆత్మీయ శిక్షణ కోసం 3 రోజులు, ఇంకా అనేకసార్లు ఉపవాసం చేశాడు (అపొస్తలుల కార్యములు 9:9; 2 కొరింథీయులకు 11:27). ఫలితం: శక్తివంత...