భాగం 1: ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత

మనలో చాలామంది ఉపవాసం చేసి, ప్రార్థించినా – ఏమి మారటంలేదు అనుకుంటున్నారా? 

దేవునికి  మొరపెడుతున్నాం, అన్ని సరిగా చేస్తున్నట్టే అనిపిస్తోంది, అయినా ఫలితం లేదు. పరిష్కారం లేదు. మార్పు లేదు. సమాధానాలు లేవు – కేవలం ప్రశ్నలే. అంటే మనం చేస్తున్న విధానం దేవుడు కోరుకునే విధంగా లేకపోవచ్చు. బైబిల్‌లో ఎంతో మంది వివిధ రకాలుగా ఉపవాసం చేసి, దేవుని నుండి గొప్పగా, ఆశ్చర్యకరమైన, అన్వేషించలేని సమాధానాలు పొందారు.

  • ఎస్తేరుతన ప్రజలను రక్షించుకోవటానికి ముందు 3 రోజులు ఆహారం, నీళ్లు లేకుండా ఉపవాసం చేసింది (ఎస్తేరు 4:16).
    ఫలితం: దేవుడు మొత్తం యూదుల జాతిని రక్షించాడు.

  • దానియేలు దేవుని నుండి అవగాహన కోసం 21 రోజులు ఉపవాసం చేశాడు (దానియేలు 9:3; 10:2–3). ఇది పూర్తిగా అన్నపానీయాలు మానివేసే ఉపవాసం కాకుండా, భోగభాగ్యాలను (రుచికరమైన ఆహారం, మాంసం, ద్రాక్షారసం, సుగంధ తైలాలు) త్యజించిన ఉపవాసం.
    ఫలితం: దర్శనాలు, దేవదూతల సందేశాలు పొందాడు.

  • పౌలు (అపొస్తలుడు) – పశ్చాత్తాపం మరియు ఆత్మీయ శిక్షణ కోసం 3 రోజులు, ఇంకా అనేకసార్లు ఉపవాసం చేశాడు (అపొస్తలుల కార్యములు 9:9; 2 కొరింథీయులకు 11:27).
    ఫలితం: శక్తివంతమైన అపొస్తలుడిగా మారాడు.

  • కొర్నేలియుడు – దేవుని కోసం వెతుకుతూ 4 రోజులు ఉపవాసం చేశాడు (అపొస్తలుల కార్యములు 10:30).
    ఫలితం: పరిశుద్ధాత్మను పొందిన మొదటి అన్యుడిగా నిలిచాడు.

  • ప్రాథమిక సంఘంముఖ్య నిర్ణయాల ముందు, దేవుని దిశను తెలుసుకోవడానికి ఉపవాసం చేసి ప్రార్థించారు (అపొస్తలుల కార్యములు 13:2–3; 14:23).
    ఫలితం: మిషనరీలుగా పంపబడారు; సంఘాలు స్థాపించబడ్డాయి.

  • మోషే – దేవుని ధర్మశాస్త్రం పొందడానికి 40 రోజులు ఉపవాసం చేశాడు (నిర్గమకాండము 34:28; ద్వితీయోపదేశకాండము 9:9).
    ఫలితం: పది ఆజ్ఞలు పొందాడు; దేవుని మహిమను చూశాడు.

  • ఏలీయా – భయం, నిరాశ తర్వాత బలం పొందడానికి 40 రోజులు ఉపవాసం చేశాడు (1 రాజులు 19:8).
    ఫలితం: దేవుడు మృదువైన స్వరంలో మాట్లాడాడు; అతనిని పునరుద్ధరించాడు.

  • యేసు క్రీస్తు – సేవ ప్రారంభానికి ముందు సిద్ధతగా 40 రోజులు ఉపవాసం చేశాడు (మత్తయి 4:1–2; లూకా 4:1–2).
    ఫలితం: శోధనలను జయించాడు; శక్తితో తన సేవను ప్రారంభించాడు.


కాబట్టి ముందుగా, బైబిల్ ప్రకారం ఉపవాసం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం: ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం మనకు ఎలా సహాయపడుతుంది? ఎన్ని విధాలుగా ఉపవాసం చేయవచ్చు? ప్రతి సమస్య, ప్రతి శోధనపై పరిష్కారం రావాలంటే ఎలా ఉపవాసం చేయాలి?

ఉపవాసం అంటే మనుషులను ఆకట్టుకోవడానికి భోజనం మానేయడం కాదు (మత్తయి 6:16).
అది –

  • దేవుని ఎదుట మనల్ని మనమే తగ్గించుకోవడం,
  • దేవుని సన్నిధిని వెతకడం,
  • పశ్చాత్తాపంతో పూర్తిగా ఆయనకు లోబడటం,
  • దేవుని స్వరాన్ని వినడం,
  • దేవుని చిత్తానికి అనుగుణంగా మన జీవితాన్ని సరిచేసుకోవడం.

ఉపవాసం అనేది దేవునికి దగ్గర కావడానికి ఇచ్చిన ఒక ఆత్మీయ శిక్షణ (Spiritual Discipline). దేవుడు కోరుకునే విధంగా సరైన రీతిలో చేసినప్పుడు, ఉపవాసంలో ఒక అద్భుతమైన  శక్తి ఉంటుంది.

సరైన విధంగా చేసిన ఉపవాసం మనకు ఎలా సహాయపడుతుంది: 

  • సరైన నిర్ణయాలు తీసుకోవడానికి
  • సేవకు సిద్ధపడడానికి (మత్తయి 4:1–2)
  • దేవుని చిత్తానికి లోబడడానికి
  • ఏ సమస్యనైనా ఎదుర్కొనే బలం మరియు జ్ఞానం పొందడానికి
  • దిశ మరియు మార్గదర్శకత్వం పొందడానికి (ఎజ్రా 8:21)
  • ఆత్మీయంగా ఎదగడానికి (లూకా 2:37)
  • పాపాలన్నింటికీ దేవుని ఎదుట పశ్చాత్తాపపడడానికి (నెహెమ్యా 9:1)
  • విమోచన మరియు విజయం పొందడానికి (ఎస్తేరు 4:16)

ఉపవాసం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరవుతాము, ఆయన స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతాము, దివ్య మార్గదర్శకత్వాన్ని పొందుతాము, పశ్చాత్తాపంతో అంతర్గత మార్పు పొందుతాము, ఆత్మీయ బలాన్ని సంపాదిస్తాము, శోధనలను జయిస్తాము మరియు ఆశీర్వాదకరమైన విడుదలను అనుభవిస్తాము. 

మరింత చదవడానికి....
భాగం 2: బైబిలులో ఉపవాసం చేసే వివిధ విధానాలు
భాగం 3: ఉపవాసం యొక్క లాభాలు & దాన్ని ఎలా ఆచరించాలి


తన వాగ్దానాలను ఎప్పటికీ మరచిపోని దేవుడు, తన వాక్యము ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి, సత్యములోను శాంతియందును మీను నడిపించుగాక.
"గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము యుగయుగాల వరకు నిలిచియుండును."
(యెషయా 40:8)

Comments

Post a Comment

Popular posts from this blog

The Blessed, The Judged, and The Approved: Lessons from Psalm 1

40 Days Lent Bible Reading Plan 2025

The Sayings of Agur in the Bible
(Exploring, Understanding & Unlocking the great sayings)