భాగం 3: ఉపవాసం యొక్క లాభాలు & దాన్ని ఎలా ఆచరించాలి
బైబిల్లో ఉపవాసం ఎప్పుడూ ఒకే ఫలితాన్ని ఇచ్చింది: నిజమైన ఉపవాసం చేసాక — మనుషులు దేవుని స్వరాన్ని వినారు, దేవుడు అద్భుతాలు చేయడాన్ని చూశారు, నిజమైన మార్పును అనుభవించారు. మనము ప్రతిసారి ఉపవాసం చేసినప్పుడు ఏదో ఒకటి తప్పకుండా మారుతుంది — కొన్నిసార్లు అది మనకు కనబడుతుంది, కొన్నిసార్లు కనిపించకపోవచ్చు.
ఇప్పుడు ఈ ఉపవాస క్రమంలో అత్యంత అందమైన భాగం ఇదే — ఉపవాసంలో లభించే ప్రతిఫలాలు. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనం నిజంగా ఆచరించినప్పుడు మనకు లభించే లాభాలు/ఫలితాలు ఏమిటో, అలాగే ఉపవాసం మన వ్యక్తిగతంగా & ఆత్మీయంగా ఎలా సహాయపడుతుందో చూద్దాం:
ఉపవాసం వల్ల కలిగే లాభాలు:
- ఉపవాసం నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది. (అపొస్తలుల కార్యములు 13:2–3)
- ఉపవాసం మనలను అన్ని ఆపదలు లేదా ప్రమాదాల నుండి కాపాడుతుంది. (ఎస్తేరు 4:16)
- ఉపవాసం ఆత్మీయ దృష్టిని తెరుస్తుంది. (దానియేలు 10:2–3)
- ఉపవాసం సాతానును ఓడించడానికి సహాయపడుతుంది. (మత్తయి 4:2)
- ఉపవాసం శోధనలను జయించడానికి సహాయపడుతుంది. (మత్తయి 4:2)
- ఉపవాసం మనలను ఆత్మీయంగా బలపరుస్తుంది. (మత్తయి 4:2)
- ఉపవాసం దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. (కీర్తనలు 35:13)
- ఉపవాసం అద్భుతంగా సహాయపడుతుంది (2 దినవృత్తాంతములు 20:3)
- ఉపవాసం సురక్షితమైన ప్రయాణం కోసం దేవుని కాపుదలని విడుదల చేస్తుంది (ఎజ్రా 8:21–23)
- ఉపవాసం మనలను పశ్చాత్తాపానికి నడిపించి దేవుని కరుణను పొందేలా చేస్తుంది. (యోనా 3:5)
- ఉపవాసం దేవునితో మరింత లోతైన సన్నిహిత సంబంధం & అనుభవాన్ని ఇస్తుంది.
- (నిర్గమకాండము 34:28; 1 రాజులు 19:8)
- ఉపవాసం మనలను దేవుని యోజనను చూడగల స్థితిలో నిలబెడుతుంది. (లూకా 2:37–38)
ఉపవాస సమయంలో మనం సాధారణంగా చేసే పొరపాట్లు:
మనలో చాలామంది ఉపవాసం చేసి ప్రార్థించినా, ఏమీ మారడం లేదనిపిస్తుంది. సమాధానాల కోసం ఎదురుచూస్తాం, అవి రాకపోతే ఎన్నో సంవత్సరాలుగా సమాధానం లేని ప్రార్థనల గురించి ఫిర్యాదు చేయడం మొదలుపెడతాం.
మనము నిరుత్సాహపడే ముందు, ఉపవాస సమయంలో చేయకూడని ముఖ్యమైన హెచ్చరికలు లేదా సాధారణ పొరపాట్లు చూద్దాం:
- ప్రార్థన లేకుండా ఉపవాసం చేయడం
- లోక సంబంధమైన వ్యాకులతలను కొనసాగించడం (టీవీ, సోషల్ మీడియా, వినోదం)
- మనుషులకు చూపించడానికి ఉపవాసం చేయడం (మత్తయి 6:16)
- స్పష్టమైన ఉద్దేశం లేకుండా ఉపవాసం చేయడం
- మన పాపాల పట్ల పశ్చాత్తాపం లేకపోవడం
- ఇతరులతో పోల్చుకోవడం
- బైబిల్ చదవకపోవడం లేదా ధ్యానం చేయకపోవడం
- ఫిర్యాదు చేయడం లేదా చెడు మనస్తత్వం కలిగి ఉండడం
- జ్ఞానం లేదా ఆరోగ్య జాగ్రత్తలు లేకుండా ఎక్కువ కాలం ఉపవాసం చేయడం
- కృతజ్ఞత లేకుండా లేదా ఆలోచన లేకుండా ఉపవాసాన్ని ముగించడం
ఉపవాసాన్ని ఎలా ప్రారంభించాలి?
- స్పష్టమైన ఉద్దేశంతో ప్రారంభించండి — నేను ఎందుకు ఉపవాసం చేస్తున్నాను? అని మిమ్మును మీరే ప్రశ్నించుకోండి.
- ప్రారంభించే ముందు ప్రార్థించండి — బలం మరియు కృప కోసం దేవునిని అడగండి.
- ఉపవాస రకాన్ని ఎంచుకోండి — జ్ఞానంతో నిర్ణయించుకోండి (కొత్తవారైతే తక్కువ సమయంతో ప్రారంభించండి).
- శరీరాన్ని సిద్ధం చేసుకోండి — ఉపవాసానికి ముందు భారమైన ఆహారం తగ్గించండి & నీరు తాగండి.
- వ్యాకులతలను దూరంగా పెట్టండి — సోషల్ మీడియా, టీవీ, వినోదం.
- రహస్యముగా ఉంచండి — రహస్యములో చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము అనుగ్రహించును (మత్తయి 6:16–18)
- కృతజ్ఞతతో ముగించండి — ప్రార్థించండి, దేవునికి కృతజ్ఞత చెప్పండి, మెల్లగా ఉపవాసాన్ని విరమించండి.
చిన్నగా ప్రారంభించండి, దృష్టిని నిలుపుకోండి, హృదయపూర్వకంగా దేవునిని వెదకండి,ఒత్తిడితో కాదు — ఉద్దేశంతో ఉపవాసం చేయండి.
ఉపవాసాన్ని కేవలం కష్ట సమయంలో మాత్రమే కాకుండా, దేవునితో నిరంతర సంబంధం కోసం జీవనశైలిగా మార్చుకునేందుకు ప్రయత్నించండి.
మరింత చదవడానికి....
భాగం 2: బైబిలులో ఉపవాసం చేసే వివిధ విధానాలు
భాగం 3: ఉపవాసం యొక్క లాభాలు & దాన్ని ఎలా ఆచరించాలి
భాగం 2: బైబిలులో ఉపవాసం చేసే వివిధ విధానాలు
భాగం 3: ఉపవాసం యొక్క లాభాలు & దాన్ని ఎలా ఆచరించాలి
తన వాగ్దానాలను ఎప్పటికీ మరచిపోని దేవుడు, తన వాక్యము ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి, సత్యములోను శాంతియందును మీను నడిపించుగాక.
"గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము యుగయుగాల వరకు నిలిచియుండును."
(యెషయా 40:8)
"గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము యుగయుగాల వరకు నిలిచియుండును."
(యెషయా 40:8)
.png)
Comments
Post a Comment