బైబిల్ మనకు రహస్యంగా ఉంచాలని చెప్పే 5 విషయాలు
ఈరోజు ప్రపంచంలో మనుషులు తమ ఆలోచనలు, కలలు, కష్టాలు, ఆశీర్వాదాలు అన్నీ ఇతరులతో పంచుకోవడం సాధారణం అయిపోయింది. కానీ బైబిల్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది — ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు దాచుకోవాలి, వాటి కోసం ప్రార్థించాలి , మరియు అవి దేవునికి మనకు మధ్య మాత్రమే ఉండాలి. ఇక్కడ మనం ఇతరులతో పంచుకోకూడని 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం: మీ తదుపరి ప్రణాళిక లేదా దర్శనం దేవుడు రహస్యంగా చెప్పిన ప్రతీ విషయం మీ మంచి పనులు లేదా మీరు చేసిన సహాయం మీ బలహీనతలను గూర్చి మీరు పొందనున్న ఆశీర్వాదాల గురించి 1. మీ తదుపరి ప్రణాళిక లేదా దర్శనం దేవుడు మనకు ఒక దర్శనం ఇచ్చినప్పుడు అది ప్రజలతో చర్చించడానికి కాదు; అది వ్యక్తిగతంగా సిద్దపడడానికి . బైబిల్లో యోసేపు తన కలను తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అసూయపడి అతనికి వ్యతిరేకంగా మారారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన ప్రణాళికలను దాచిపెడతాడు — శిక్షించడానికి కాదుకాని, మనలని ర క్షించడానికి. 2. దేవుడు రహస్యంగా చెప్పిన...