గుణవతియైన స్త్రీ యొక్క ముఖ్య లక్షణాలు

సామెతలు 31:10-31 లో గుణవతియైన స్త్రీను కనుగొనడం కష్టం అని చెప్పబడింది. ఆమె అరుదైన ధనము, మాణిక్యములకంటే విలువైనది. దేవునికి గుణవతియైన స్త్రీ అనగా — దేవుని నిజముగా ఆరాధించే స్త్రీ. అది ఆమె మాటల్లో, ఆమె కార్యాల్లో, అలాగే ఆమె ధరించే విధానంలో కూడా కనిపిస్తుంది. అటువంటి స్త్రీ బలమైనది, విశ్వాసముగలది, విధేయురాలు, మర్యాదగల స్త్రీ, మరియు సత్యమునకు కట్టుబడి ఉంటుంది.

సామెతలు 31వ అధ్యాయం చదువుతున్నప్పుడు గుణవతియైన స్త్రీ యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు మనకు కనిపిస్తాయి:

  1. ఆమె అమూల్యురాలు మరియు విలువైనది (31:10)
    ఆమె మాణిక్యములకంటే, వజ్రములకంటే గొప్పది, విలువైన రత్నాలవలె ఆమె సౌందర్యముగలది; అవి ఎలా రూపుదిద్దుకొని బలపడతాయో, అలాగే ఆమె కూడా నిత్యకాలము వరకు బలపడుతూ రూపుదిద్దుకుంటుంది.

  2. ఆమె విశ్వాసయోగ్యురాలు మరియు సంపూర్ణురాలు (31:11-12)
    ఆమె తన కుటుంబ సభ్యుల హృదయాలను శాంతితో నింపుతుంది. అందరూ ఆమెను మరియు ఆమె సామర్థ్యాలను విశ్వసిస్తారు, ఎందుకంటే ఆమె విశ్వాసాన్ని సంపాదించింది. ఆమె స్వభావం, విశ్వాసం, మాటలు, మంచి కార్యాల కోసం ప్రశంసింపబడుతుంది. ఆమె వినయశీలురాలు; తన్ను తాను పొగడుకోకుండా ఇతరుల అభివృద్ధికి కృషి చేస్తుంది.

  3. ఆమె కష్టపడి పనిచేసే స్వభావముగలది మరియు అవసరాలను సమకూర్చేది. (31:14-15)
    ఇంకా రాత్రి ఉన్నప్పుడే ఆమె లేచును.” (సామెతలు 31: 14-15) ప్రకారంగా గుణవంతురాలు తన పనిలో నిబద్ధతతో ఉంటుంది; మంచి విషయాలను ప్రేమిస్తుంది; ఉదయం చాలా త్వరగా తన రోజును ప్రారంభిస్తుంది. పురుషునికి సహాయకురాలిగా ఆమె తన భర్తకు, కుటుంబ అవసరాలను సమకూర్చడంలో సహాయం చేస్తుంది (ఆదికాండము 2:18-22). 

  4. ఆమె జ్ఞానవంతురాలు మరియు బలమైనది (31:16-17)
    “...తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.” (సామెతలు 31: 16-17)
    ప్రకారంగా జ్ఞానపూర్వకమైన నిర్ణయాల వల్ల ఆమె ఫలితాలను కూడా పొందుతుంది.  గుణవంతురాలు జాగ్రత్తగా, జ్ఞానంతో ప్రణాళికలు వేసుకుంటుంది. ఆమె వివేకవంతురాలు, బాధ్యతగలది, ఆలోచనాశీలురాలు. తాను నీతిమార్గంలో నడవడానికి మరియు దేవుని చిత్తాన్ని అనుసరించడానికి నిర్ణయాలలో దేవుడు జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తుంది. 

  5. ఆమె ధైర్యవంతురాలు మరియు కరుణగల హృదయముగలది (31:25-26)
    ఆమె తన విలువను తెలుసుకొని, తన ప్రతిభలను దేవుని సేవలో ఉపయోగిస్తుంది. దేవునికి తన జీవితంలో మొదటి స్థానమిస్తుంది. ఆమె కరుణ హృదయముగలది.; అవసరమైనవారికి విశాల హృదయంతో సహాయం చేస్తుంది. ఆమె దేవుని హృదయానికి ప్రతిబింబము; ఇతరులను ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది, ధైర్యం నింపుతుంది.

  6. ఆమె అరుదైనది మరియు దైవభక్తురాలు  (31:29-30)
    ఆమె సమర్పణ భావం మరియు కష్టపాటు వలన అరుదైన వజ్రమువలె ప్రత్యేకంగా నిలుస్తుంది. దేవునియందు భయ భక్తులు కలిగి యుండుట  స్త్రీ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. ఆమె అందమైనది కాబట్టి కాదు, ప్రసన్నమైనది కాబట్టి కాదు; కానీ ప్రభువుతో ఉన్న సంబంధం వలన ఆమె గుణవంతురాలై ప్రకాశిస్తుంది.
గుణవతియైన స్త్రీ యొక్క స్థాయి అత్యున్నతమైనది. మనకు సాధ్యమైనంతవరకు దేవునికి ఇష్టమైన స్త్రీగా ఉండటానికి ప్రయత్నిదాం. ప్రతి రోజు ప్రార్థన చేయడం మరియు దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకుందాం. ఈ విధంగా మనము ప్రతి రోజూ దేవునికి మరింత సమీపమవుతూ, హన్నా మరియు హాగరు లాగానే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగినవారమవుదాము. ఈ అద్భుతమైన వాక్యాలను మరియు సత్యాలను ప్రతిరోజు మన జీవితాల్లో అలవాటు చేసుకోవడానికి దేవుడు మనలను నడిపించుగాక.


"గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము యుగయుగాల వరకు నిలిచియుండును."
(యెషయా 40:8)
తన వాగ్దానాలను ఎప్పటికీ మరచిపోని దేవుడు, తన వాక్యము ద్వారా దేవుడు మన అందరినీ ఆశీర్వదించుగాక.

Comments

Popular posts from this blog

The Blessed, The Judged, and The Approved: Lessons from Psalm 1

40 Days Lent Bible Reading Plan 2025

The Sayings of Agur in the Bible
(Exploring, Understanding & Unlocking the great sayings)